
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఈ సారి కోహ్లీని టార్గెట్ చేశాడు. ఇప్పటి వరకు కపిల్ దేవ్, ధోనీలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన యోగరాజ్.. లేటెస్ట్ గా విరాట్ కోహ్లీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తన కొడుకు యువరాజ్ కెరీర్ మధ్యలోనే ఆగిపోవడానికి కారణం కోహ్లీ అని ఆరోపించాడు యోగరాజ్. ధోనీ లాగే కోహ్లీ కూడా వెన్నుపోటు దారుడు అని అన్నాడు. తన కొడుకుకు ఉన్న ఏకైక స్నేహితుడు, ఫ్రెండ్ అంటే సచిన్ మాత్రమేనని అన్నాడు. యువీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో కోహ్లీ సపోర్ట్ చేసి ఉంటే ఎలా ఉండేది అనే ప్రశ్నకు ఈ విధంగా విరుచుకుపడ్డాడు యోగరాజ్. అందరికీ ఇన్ఫీరియారిటీ ఉండేదని.. తన కొడుకు వాళ్ల స్థానాన్ని ఆక్యుపై చేస్తాడనే భయంతో అన్యాయం చేశారని విమర్శించాడు.
ఇక్కడ ఎవరూ ఎవరికీ ఫ్రెండ్స్ కారు.. డబ్బు, పరపతి మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అంతా వెన్నుపోటు దారులే ఉంటారు. నిన్ను కిందికి లాగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. చాలా మందికి యువరాజ్ అంటే భయం. ఎందుకంటే వాళ్ల పొజిషన్స్ ను ఆక్యుపై చేస్తాడనే భయం. అలాంటి అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ యువరాజ్. ధోనీ, కోహ్లీతో సహా అందరూ యువీని చూసి భయపడినవాళ్లే. వాళ్ల చైర్ ను లాగేస్తాడని భయపడిన వాళ్లేనని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
యోగరాజ్ సింగ్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో కపిల్ దేవ్, ఆ తర్వాత ధోనీ మొదలైన స్టార్ ప్లేయర్లను టార్గెట్ చేస్తూ వచ్చాడు. తన కెరీర్ త్వరగా ముగిసి పోవడానికి కపిల్ దేవ్ కారణమని.. 1983 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలిచిన తర్వాత కపిల్ దేవ్ ఎలాంటి కారణం లేకుండా తనను తొలగించాడని ఆరోపించాడు.
అదే విధంగా ఎంఎస్ ధోనిపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపించాడు. ధోనీని నేను క్షమించను. అతను మొత్తం క్రెడిట్ ను తీసుకుంటాడు. ధోనీ చాలా పెద్ద క్రికెటర్. కానీ నా కొడుకుపై ఏం చేసాడనే ప్రతి విషయం ఇప్పుడు బయట పడుతుంది. అతన్ని నా జీవితంలో ఎప్పటికీ క్షమించను. నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే నా ఫ్యామిలీ అయినా నేను క్షమించను".