నచ్చిన ఫుడ్​ తింటూ ఈజీగా బరువు తగ్గొచ్చు

నచ్చిన ఫుడ్​ తింటూ ఈజీగా బరువు తగ్గొచ్చు

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​లో నచ్చిన ఫుడ్​ తింటూ ఈజీగా బరువు తగ్గొచ్చు. అయితే, ఈ డైట్​లో ఫలానా టైంకి తినాలనే రూల్​ కచ్చితంగా పాటించాలి. సమీరా రెడ్డితో పాటు చాలామంది సెలబ్రిటీలు బరువు తగ్గడానికి ఈ డైట్​నే పాటిస్తున్నారు...

తినాల్సినవి

 

  •   అవకాడోలో క్యాలరీలతో పాటు మోనోశాచ్యురేటెడ్​ ఫ్యాట్స్​ ఎక్కువ ఉంటాయి. అందుకే అవకాడో తినగానే పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. భోజనంతో పాటు సగం అవకాడో తినాలి. 
  •   వారానికి పావుకిలో  చేపలు తప్పక తినాలి. చేపల్లో ప్రొటీన్లతో పాటు హెల్దీఫ్యాట్స్​, విటమిన్​–డి ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చేపలు మంచివి. 
  •   కాలీఫ్లవర్​, క్యాబేజి, బ్రకోలిలో  ఫైబర్​ ఎక్కువ. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. ఆలుగడ్డలు తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది. 
  •   చిక్కుడుజాతి గింజలు, బీన్స్​లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. క్యాలరీలు తక్కువ. ప్రొటీన్​, ఫైబర్​ ఉంటాయి. 
  •   ప్రొబయాటిక్స్​ ఉండే పెరుగు తింటే జీర్ణసమస్యలు రావు. ఒక గుడ్డు తింటే 6 గ్రాముల ప్రొటీన్​ అందుతుంది.
  •   స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలలో విటమిన్​–సి ఉంటుంది. వీటిలోని ఫ్లేవనాయిడ్స్​ బరువు తగ్గడాన్ని ఈజీ చేస్తాయి.
  •   నట్స్​ తింటే సరిపడా క్యాలరీలు అందుతాయి. వీటిలోని పాలీఅన్​శాచ్యురేటెడ్​ ఫ్యాట్​ ఆకలిని తగ్గిస్తుంది. 
  •   కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్​ ఉండే చిరుధాన్యాలు, పప్పులు తినాలి. ఇవి రెగ్యులర్​గా తింటే మెటబాలిజం మెరుగ్గా జరుగుతుంది.