Health Tips : ఆఫీసులో పని చేస్తూనే.. ఇలా బరువు తగ్గొచ్చు

Health Tips : ఆఫీసులో పని చేస్తూనే.. ఇలా బరువు తగ్గొచ్చు

ఒకప్పుడు ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్లు. దీంతో శారీరక శ్రమ ఉండి, ఫిట్ గా ఉండేవాళ్లు. ఇప్పుడేమో ఎక్కువ జనాలు ఆఫీసులకే పరిమితమవుతున్నారు. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరానికి శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా బరువు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లే తీరిక లేక ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటి వాళ్లు ఆఫీసులోనే బరువు తగ్గే మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.

ఆఫీసులో కూర్చునేపనైనా సరే... మధ్య మధ్యలో లేచి నిల్చోవాలి. అలాగే అటూ ఇటూ నడవాలి. రోజంతా ఒకే చోట అసలు కూర్చోవద్దు. అలా డెస్క్ దగ్గరే కూర్చోవడం వల్ల బరువు పెరుగు తారు. అందుకే గంటలో 2,-3 నిమిషాలు సీట్ లో నుంచి లేవాలి. చేసే పని ఏదైనా ఫోన్ ద్వారా చేయాల్సింది అయితే... నిల్చొని లేదా నడుస్తూ చేయొచ్చు. దానివల్ల కొన్ని క్యాలరీలైనా కరుగుతాయి.

నీళ్లు బాగా తాగాలి..

డెస్క్ దగ్గర ఒక నీళ్ల బాటిల్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలి. బరువు తగ్గాలంటే నీళ్లు తాగాల్సిందే నని గుర్తుచేసుకోవాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లనైనా తాగాలి. 

వెండింగ్ మెషిన్ కి దూరం..

ప్రస్తుతం చాలా ఆఫీసుల్లో వెండింగ్ మెషిన్లు ఉంటున్నాయి. దాంతో ఎప్పుడు ఏం తినాలని పించినా... కోక్ తాగాలనిపించినా.. వెంటనే వెళ్లి తీసుకుంటున్నారు. ఆ పదార్థాల్లో ఎలాంటి పోషకాలుండవు. పైగా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. దానివల్ల బరువు పెరగడం ఒక్కటే కాదు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి చిప్స్, కూల్ డ్రింక్స్ కావాలని అనిపించినా, వెండింగ్ మెషింగ్ కు వెళ్లొద్దు. అలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి. 

లంచ్ బాక్స్ తీసుకెళ్లాలి..

కచ్చితంగా బరువు తగ్గాలి లేదా పెరగకూడ దనుకుంటే... రోజూ ఆఫీసుకి ఇంట్లో నుంచే లంచ్ బాక్స్ తీసుకెళ్లాలి. లేదంటే రెస్టారెంట్స్ లో నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అందులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. దాంతో బరువు పెరుగుతారు. అలాగే తీసుకెళ్లే లంచ్ బాక్స్ కూడా ఆరోగ్యకరమైన పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలి.

మెట్లెక్కాలి..

ఆఫీసులో చాలామంది పై అంతస్తుల్లోని ఫ్లోర్కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు లిఫ్ట్లను ఉపయో గిస్తారు. ఇకపై అలా కాకుండా మెట్లను వాడితే బరువు తగ్గొచ్చు. మెట్లను ఎక్కుతూ, దిగుతూ ఉంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, బీపీ కంట్రోల్ లోఉంటుందని 'హెల్త్ ప్రమోషన్ బోర్డ్ " కూడా స్పష్టం చేసింది.

వ్యాయామం కూడా చేయాలి..

పైన చెప్పినవన్నీ చేస్తూనే వ్యాయామం కూడా తప్పనిసరి. రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం కోసం కేటాయించాలి. అలా కుదరకపోతే కనీసం నడవడం, సైకిల్ తొక్కడం లాంటివైనా చేయాలి. ఇంటికి ఆఫీసు కొంత దగ్గ రగానే ఉంటే, మోటార్ వెహికిల్స్, పబ్లిక్ ట్రాన్స్ పోస్ట్కాకుండా సైకిల్ని వాడాలి. నడిచి వెళ్లేంత దూరమే అయితే హాయిగా నడుచుకుంటూ వెళ్లడం మేలు.