గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ : రద్దీ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ : రద్దీ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది

రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్తే మన అక్కడ పార్కింగ్ లో ఎన్నో వాహనాలు ఉంటాయి. అయితే వాటిలో మన వెహికిల్ ఎక్కడ ఉందో అనే కన్ఫూజన్ పక్కా తలెత్తుతుంది. పార్క్ చేసిన వాహనాన్ని వెతకడానికి ఎంతో కొంత మన టైం వేస్ట్ అవుతుంది. గూగుల్ మ్యాప్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకోచ్చింది. అయితే మనం పార్క్ చేసిన వాహనం దీంతో ఎక్కడ ఉందో ఇట్టే కనిపెట్టేయోచ్చు. అదే సేవ్ యూవర్ పార్కింగ్ లొకేషన్ అనే ఫీచర్. ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్ లోనే ఉంటుంది.. కానీ దీన్ని యూస్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాల్లో అవ్వండి.

పార్కింగ్ ప్లేస్ ఇలా సేవ్ చేయండి

 • step 1 : మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి
 • step 2: ప్రసెంట్ మీరు ఉన్న లొకేషన్ ఆక్సెస్ ఇవ్వండి, అప్పుడు మీరు ఉన్న లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో బ్లూ కలర్ డాట్ హైలెట్ చేస్తూ చూపిస్తుంది. 
 • step 3: ఆ బ్లూ డాడ్ పై క్లిక్ చేయండి.
 • step 4: తర్వాత కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సేవ్ పార్కింగ్ లొకేషన్ అనే దానిపై క్లిక్ చేశాయి.
 • step 5: దీంతో ఆ లొకేషన్ సేవ్ అయిపోతుంది.

సేవ్ పార్కింగ్ లొకేషన్ కనుక్కొవడం ఇలా

 • step 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Maps యాప్‌ని ఓపెన్ చేయండి.
 • step 2: మీ ప్రసెంట్ లొకేషన్ ను సూచించే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి.
 • step 3: మీరు స్క్రీన్‌పై అనేక ఆప్షన్లు వస్తాయి. షేర్ లొకేషన్ చిహ్నం పక్కన ఉన్న "సేవ్ పార్కింగ్" ఎంపికపై నొక్కండి.
 • step 4: జూమ్ అవుట్ చేసి, Google మ్యాప్స్‌లో 'మీరు ఇక్కడ పార్క్ చేసారు' అని కనుగొనండి
 • step 5: మీరు Google మ్యాప్స్‌లో మీ పార్కింగ్ స్థానాన్ని గుర్తించిన తర్వాత, దానిపై క్లిక్ చేయండి.
 • step 6: మీ పార్కింగ్ ప్లేస్ కు నావిగేట్ చేయడానికి డైరెక్షన్ పై క్లిక్ చేయండి.  అప్పుడు గూగుల్ మ్యాప్స్ మీ కారు లేదా బైక్ పార్కింగ్ ప్లేస్ దగ్గరకి మిమ్మల్ని తీసుకెళ్తోంది.

ALSO READ | పడిపోయిన కార్ల అమ్మకాలు.. రోడ్డెక్కని 6 లక్షల కార్లు...