హిందీని బలవంతంగా రుద్దొద్దు: రజనీకాంత్

హిందీని బలవంతంగా రుద్దొద్దు: రజనీకాంత్

దేశమంతా ఒకే భాష( హిందీ భాష) ఉండాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వస్తున్నాయి.  ఆయా ప్రాంతాలను బట్టి ఆయా భాషలుంటాయే తప్ప ప్రతీ ఒక్కరూ హిందీ భాష నేర్చుకొని మాట్లాడడమనేది సమంజసం కాదని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. బుధవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ…    హిందీ భాషను బలవంతంగా ప్రజలపై రుద్దొద్దని అన్నారు. దేశమంతా ఒకే భాష ఉండాలనుకోవడం, మాట్లాడాలనుకోవడం భారతదేశానికే కాదు ఏ దేశ ఐక్యతకైనా, అభివృద్ధికైనా మంచిదే.  కాని దురదృష్ట వశాత్తు మన దేశంలో అలాంటి కామన్ లాంగ్వేజ్ లేదు. కాబట్టి  హిందీ గురించి తెలియని వారిని ఆ భాషలో మాట్లాడాలని బలవంతపెట్టడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.

హిందీ భాష తప్పనిసరి చేయడాన్ని  తమిళనాడు రాష్ట్రం మాత్రమే కాకుండా మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని రజనీకాంత్ అన్నారు.