సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో.. ఉపేంద్ర యూఐ ది మూవీ

సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో..  ఉపేంద్ర యూఐ ది మూవీ

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘యూఐ ది మూవీ’.  రీష్మా నానయ్య హీరోయిన్.  నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆసక్తి రేపిన మేకర్స్.. బుధవారం ఉపేంద్ర బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇందులో గుర్రంపై ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించారు ఉపేంద్ర. అలాగే మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు.  సరికొత్త ఫాంటసీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రం ఉండబోతోందని మేకింగ్ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఉపేంద్ర కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే హై బడ్జెట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.  జి. మనోహరణ్,  కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సినిమా విడుదల కానుంది.