మందు తాగొద్దన్నందుకు యువకుడు ఆత్మహత్య

మందు తాగొద్దన్నందుకు యువకుడు ఆత్మహత్య

గచ్చిబౌలి, వెలుగు : తండ్రి, సోదరుడు మందలించడంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్‌‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌‌లోని కాళికాపూర్​ప్రాంతానికి చెందిన మిలన్ ఘోష్‌‌  కుమారులు సోమంత్​ఘోష్‌‌​(24),  సందీప్​ఘోష్‌‌  సిటీకి వచ్చి  డైమండ్​హిల్స్ లోని​సాయిబాబా గుడి ఏరియాలో ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు.  సోమంత్​రెండేళ్లుగా మాదాపూర్​లోని రైట్​ఫుడ్ క్యాంటిన్​లో వంట మనిషి, మరో చోట సందీప్​ స్వీట్​ షాప్​లో వంట మనిషిగా పని చేస్తున్నారు. సోమంత్ మద్యానికి అలవాటు పడి రెండు నెలల కిందట మానేసాడు. అతడు రెండు రోజులుగా మళ్లీ మద్యం తాగుతుండడంతో ఫోన్‌‌లో తండ్రి, సోదరుడు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన సోమంత్‌‌ సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఎవరు లేని సమయంలో గదిలోరూంలో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు కంప్లయింట్‌‌ చేయగా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.