మంచుతో కారు.. అచ్చం ఒరిజినల్ కారులాగే..

మంచుతో కారు.. అచ్చం ఒరిజినల్ కారులాగే..

ఎవరైనా ఏదైనా వస్తువును పాత సామానుతోనో, పనికిరాని వస్తువులతోనో తయారుచేయడం చూశాం. కానీ, ఈ యువకుడు మాత్రం కరిగిపోయే మంచుతో కారును తయారుచేశాడు. అది అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. శ్రీనగర్‌కి చెందిన జుబైర్ అహ్మద్ కార్లకు సంబంధించిన ఆక్సెసరీలు అమ్మె బిజినెస్ చేస్తున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి కార్లంటే ఇష్టం. ఆ మక్కువతోనే ఐస్‌తో కారును తయారుచేశాడు. అది చూడటానికి అచ్చం ఒరిజినల్ కారును పోలి ఉంది. అది కూడా స్పోర్ట్స్ కారులా ఉంది.

‘మంచుతో ఏదైనా తయారుచేయడం నాకు చిన్పప్పటి నుంచి అలవాటు. ఈ ప్రపంచం కోసం ఏదైనా తయారు చేయాలనుకుంటున్నాను. మంచును ఉపయోగించి తాజ్ మహల్‌ను కూడా తయారుచేయగలను. నాకు కావలసిన వస్తువులు మరియు ఆర్థికసాయం చేస్తే మంచుతో ఏదైనా తయారుచేయగలను. చివరికి మనిషిని కూడా తయారుచేయగలను’ అని జుబైర్ అంటున్నాడు.