ఫ్యాన్స్ ప్రేమకు ముగ్దుడైన జూనియర్ ఎన్టీఆర్

ఫ్యాన్స్ ప్రేమకు ముగ్దుడైన జూనియర్ ఎన్టీఆర్

నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు నాడు తమ హీరోని చూసి, శుభాకాంక్షలు చెప్పాలని గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, ‘హ్యాపీ బర్త్ డే తారక్ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. కొందరు ఫ్యాన్స్ రోడ్లపై టపాసులు కాల్చి, కేకులు కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 

అభిమానుల ప్రేమకు ముగ్దుడైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేఖ రాశారు. తన కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సినీ రంగానికి చెందిన తోటి నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. తమ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మీ ఆదరణ నా హృదయాన్ని కదిలించింది’ అంటూ లేఖలో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనందున ఫ్యాన్స్ ను కలవలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు. ‘మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నేను ఎప్పటికీ మీ అభిమానానికి రుణపడి ఉంటాను’ అంటూ లేఖ రాశారు. 

మరిన్ని వార్తల కోసం..

ఐపీఎల్ లో టాప్ 5 అత్యధిక స్కోర్లు చేసిన ..

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ..