బర్త్ డే పార్టీకి పిలిచి.. యువతిపై అత్యాచారం..పరారీలో నిందితుడు

బర్త్ డే పార్టీకి పిలిచి.. యువతిపై అత్యాచారం..పరారీలో నిందితుడు

కూకట్​పల్లి, వెలుగు: ఇన్​స్టాగ్రామ్​లో ఓ సాఫ్ట్​వేర్ యువతికి పరిచయమైన యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలానగర్​పోలీసుల కథనం ప్రకారం.. ఖాజాగూడలో ఉండే యువతి(25)కి నెల రోజుల క్రితం బాలానగర్​లో నివసించే జక్కా సిద్ధారెడ్డితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్​లో చాటింగ్​ చేస్తుండేవారు. గత నెల 29న ఆ యువతి బర్త్​డే కావడంతో సిద్ధారెడ్డి తన రూమ్​లో పార్టీ చేసుకుందామని కోరాడు. అంగీకరించిన ఆమె అదేరోజు సాయంత్రం బాలానగర్​పరిధి మాధవినగర్​లోని అతని గదికి వెళ్లింది. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. 

అందులో మత్తు మందు కలిపిన సిద్ధారెడ్డి ఆ యువతి నిద్రలోకి జారుకున్నాక అత్యాచారం చేసి, పరారయ్యాడు. తెల్లవారుజామున మెలకువ వచ్చాక జరిగింది గ్రహించిన బాధితురాలు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.