పరిచయం : సపోర్టింగ్​ రోల్స్​కి కేరాఫ్​ సైజూ కురుప్

పరిచయం :  సపోర్టింగ్​ రోల్స్​కి కేరాఫ్​ సైజూ కురుప్
 

‘లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ సోలోగా ఎందుకు చేయట్లేద’ని కొందరు అడుగుతారు. అలా అడిగే వాళ్లకు నేను చెప్పేదేంటంటే... ‘మయూఖం’, ‘స్కెచ్’, ‘సీన్ నెం.001’ వంటి సినిమాల్లో సోలోగా చేశా. కానీ ఇప్పుడు చేయడం లేదు. నిజానికి నేను టార్గెట్​ పెట్టుకోలేదు. అలాపెట్టుకుంటే బాధ్యత పెరుగుతుంది. నిర్మాతలు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారనే ఒత్తిడి పెరిగిపోతుంది. అలాంటివేవీ లేకుండా కంటెంట్ ఉన్న సినిమాల్లో కంఫర్టబుల్​గా సపోర్టింగ్​ రోల్స్​ చేస్తే చాలు అనిపించింది’ అంటున్నాడు మలయాళ నటుడు సైజూ కురుప్​. ఆ జర్నీ వివరాలు ఆయన మాటల్లోనే...

‘‘మొదటి సినిమా మయూఖంలో చేసేటప్పుడు డైరెక్టర్​ హరిహరన్ చాలా సాయం చేశాడు. అప్పుడే యాక్టింగ్​లో బేసిక్స్ నేర్చుకున్నా. అందులో నా క్యారెక్టర్​ పేరు ఉన్ని. ఆ క్యారెక్టర్​కు చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ ఎలా చూపించాలో డైరెక్టర్​ నాకు చేసి చూపించేవాళ్లు. అక్కడ నేర్చుకున్నదే నా తర్వాతి సినిమాల్లోనూ అప్లై చేశా. 2009–10 మధ్య అంటే ‘ముల్ల, డబుల్స్, కర్మయోగి’ సినిమాలు చేసే టైంలో పర్ఫార్మెన్స్​లో రిథమ్ ఉండాలనే విషయం తెలిసింది. అందుకే నా డైలాగ్​ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మునుపటి సినిమాలకంటే ఈ మూడింటిలో బెటర్​గా ఉంటాయి. ఆ తర్వాత నా స్కిల్స్​ మరింత మెరుగుపరుచుకున్నా. క్యారెక్టర్స్​ని సెలక్టివ్​గా ఎంచుకోవడం మొదలుపెట్టా. ఆ టైంలోనే తమిళంలో ‘ఆది భగవాన్​’ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ అమీర్ కూడా పర్ఫార్మెన్స్ చేయడం నేర్పించాడు. అది నాకు చాలా హెల్ప్​ అయింది. నా మొదటి సినిమా అయిపోయాక ఎనిమిదేండ్లకు ‘త్రివేండ్రం లాడ్జి’ సినిమాతో బ్రేక్​ వచ్చింది. అది నా కెరీర్​లో మైలురాయిగా నిలిచింది. 

యాక్టింగ్ నా డ్రీమ్​ కాదు

సినిమా గురించి నేను కలలు కనలేదు. ఇండస్ట్రీలోకి రావడానికి కష్టాలు పడలేదు. ఒక లెజెండరీ డైరెక్టర్​ నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాను అనడం నాకు దొరికిన పెద్ద బోనస్.  ఎందుకంటే యాక్టర్​గా నాకు ఎప్పుడూ పెద్ద సవాళ్లు ఎదురుకాలేదు. అలాగే  హీరోగానే చేయాలని నేను ఇండస్ట్రీకి రాలేదు. హీరోగా చేశా కాబట్టి ఇక నుంచి లీడ్​ రోల్స్​ మాత్రమే చేయాలని అనుకోలేదు. డిసెంబర్ 2005లో అంటే.. నా మొదటి సినిమా ‘మయూఖం’ రిలీజ్​ అయిన ఒక నెల తర్వాత ‘లయన్’ అని రెండో సినిమా షూటింగ్​ మొదలైంది. ఆ టైంలో నా మైండ్​లో నా నెక్స్ట్​ ప్రాజెక్ట్​ ఏంటి? అనే ఆలోచనే ఉండేది. దాంతోపాటు పనిలో ఒత్తిడి కూడా పెరిగింది. అప్పటివరకు చేసిన కార్పొరేట్ జాబ్​ మానేసి, ప్రాజెక్ట్స్​ ‘ఓకే’ చేసే పనిలో పడ్డా. అప్పట్లో నేను– సినిమాల్లో నటిస్తే నాకు ఆదాయం​ వస్తుంది. నటించడం అనేది సంపాదించడానికి నాకున్న ఒక సోర్స్​ అనుకున్నా. కానీ 2008–09కి వచ్చేసరికి సినిమా అనేది ప్యాషన్​ అయింది నాకు. అంతేకానీ లీడ్ రోల్స్ రావట్లేదనే డిజప్పాయింట్​మెంట్ నాకెప్పుడూ కలగలేదు. 

రోల్ ఏదైనా...

నేను హ్యూమరస్​ రోల్స్ చేసినా ఆ క్యారెక్టర్​కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్గానిక్ హ్యూమర్ ఉన్న పాత్రలు కోరుకుంటా. సిటీ, రూరల్​కి చెందిన రెండు  క్యారెక్టర్స్ చేసే అవకాశాలు సమానంగా వస్తుంటాయి. కేరళలోని రూరల్ ఏరియాల్లో చూస్తే అక్కడి మగవాళ్లు ఎక్కువగా లుంగీ లేదా పంచెకట్టులో కనిపిస్తారు. అలాగే కాస్ట్యూమ్, మేకప్, లొకేషన్​లు చేసే క్యారెక్టర్​లో ఇన్వాల్వ్ అవ్వడానికి బాగాహెల్ప్ చేస్తాయి. అంతెందుకు.. నా టీనేజ్​ వయసులో లుంగీ కట్టుకునేవాడ్ని. నేను కేరళలో పెరగకపోయినా లుంగీ కట్టుకునే అలవాటు ఉండేది. 
చెప్తే నవ్వుతారు కానీ అప్పట్లో మేం క్రికెట్​ ఆడేటప్పుడు బాల్​ ఆపడానికి వీలుగా ఉంటుందని లుంగీ కట్టుకుని మరీ ఆడేవాడిని. కాబట్టి నాకు ఆ బట్టలు హ్యాండిల్ చేయడం ఈజీనే. నిజానికి ప్యాంట్స్ కంటే లుంగీ, పంచె కట్టుకుంటే యాక్టింగ్​లో రకరకాల మేనరిజమ్స్ మార్చే అవకాశం ఉంటుంది.

సినిమా రిజల్ట్​ చెప్పలేం

‘1983’ సినిమా తర్వాత అంటే... 2014 నుంచి నేను సినిమా థియేటర్​కి వెళ్లలేదు. అప్పట్లో ఆన్​లైన్ రివ్యూస్​ కూడా లేవు. ఫోన్​ పట్టుకుని కాల్స్ కోసం ఎదురుచూసేవాడ్ని. అప్పుడు నాకు ఫస్ట్​ ఫోన్​ కాల్ వచ్చింది. ‘సినిమా  జస్ట్ ఓకే. ఒక డాక్యుమెంటరీ ఫీల్​ ఉంది’ అని చెప్పారు. అది విని చాలా అప్​సెట్​ అయ్యా. కానీ, అది సూపర్​హిట్​ అయింది. అలాగే ఈ సినిమాకంటే ముందు రిలీజ్​ అయిన‘తీవండి’ సినిమా అప్పుడు కూడా ఒకరు ‘ఫస్టాఫ్​ బాగుంది.. సెకండాఫ్ లాగ్ అయింది’ అన్నారు. అప్పుడు నేను థియేటర్​లోనే ఉన్నా. ఆ మాట విన్నాక ఎవరినీ పట్టించుకోలేదు. కాల్స్ అటెండ్ చేయలేదు. సినిమా అయిపోయాక నా ఆఫీస్​కి వెళ్లిపోయా. అప్పటికి దాదాపు పదిహేను మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటన్నింటికీ రిటర్న్ కాల్ చేయడం మొదలుపెట్టా. వాళ్లంతా ‘కంగ్రాచ్యులేషన్స్’ అని చెప్తున్నారు. అప్పుడు అనిపించింది.. ఒకరు నెగెటివ్​గా రివ్యూ చెప్పారని అదే నిజమైపోదు. ఆడియెన్స్​ ఎలా ఫీలవుతారు? అనేది చెప్పలేం అని. 
‘త్రివేండ్ర లాడ్జి’ సినిమా రిలీజ్​ అప్పుడు ఉదయం​ నేను గుడికి వెళ్లి మొక్కుకున్నా. ఫస్ట్​ షో అయిపోయాక రెస్పాన్స్‌‌‌‌బాగానే వచ్చింది. అప్పుడు నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. కొన్నిసార్లు ‘సినిమా బాగాలేదు. కానీ, నీ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంద’ని చెప్పేవాళ్లు. మొదట్లో హ్యాపీగా ఫీలయ్యేవాడిని. కానీ సినిమా బాగుంటేనే కదా క్యారెక్టర్​ గుర్తుపెట్టుకునేది అనిపించింది. అలా ‘ఆడు’, ‘కెఎల్​10 పాతు’ సినిమాల విషయంలో జరిగింది.

కథ నచ్చితే..

నాకు ఎవరైనా కథ చెప్పినప్పుడు అది నచ్చితే మిగతా స్క్రిప్ట్ నెరేట్ చేయమని అడుగుతా. లేదంటే చేయనని చెప్పేస్తా. అంతేకానీ, వాళ్ల టైంని నేను వేస్ట్​ చేయను. స్క్రిప్ట్ తీసుకుని చదివి చెప్తా అనొచ్చు. కానీ, దానికంటే వినడమే బెటర్. నేను చదివి చెప్పాలంటే రెండు మూడు నెలలు పడుతుంది. కారణం.. షూటింగ్​ ఉన్నప్పుడు మధ్యలో చదవడం కుదరదు. ఇంట్లో ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. కాబట్టి నేను అన్ని నెలలు వాళ్లు వెయిట్ చేయడం కంటే గంటన్నర స్ర్కిప్ట్​ నెరేట్ చేస్తే సరిపోతుంది.’’

ఒకప్పుడు యాక్టింగ్​ తన డ్రీమ్ కాదన్న అతనే ఇప్పుడు ప్యాషన్​ అంటున్నాడు. అతని పేరు సైజూ కురుప్. గత పదేండ్లుగా మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపించింది ఈయన ఫేస్. అలాగని పెద్ద హీరో కాదు. కమెడియన్, విలన్​ కాదు. కానీ, ఏ క్యారెక్టర్​ చేస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. కామెడీ చేసి నవ్విస్తాడు. సెంటిమెంట్​ పండిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సపోర్టింగ్​ రోల్స్​కు న్యాయం చేస్తాడు. కేరళలో పుట్టినప్పటికీ వేరే రాష్ట్రంలో పెరగడం వల్ల మాతృభాష మలయాళం నేర్చుకోవడానికి తిప్పలు పడ్డాడు. మొత్తానికి మాతృభాష నేర్చుకుని ఇండస్ట్రీలో నిలబడ్డాడు. 

మలయాళం.. అలా నేర్చుకున్నా

అమ్మానాన్న పేర్లు గోవింద కురుప్, శోభన. నాన్న సీనియర్ అకౌంటెంట్​ ఆఫీసర్​గా పనిచేశారు. నాకో అక్క ఉంది. పేరు సైరా. నాకు నాలుగేండ్లు వచ్చేవరకు కేరళలోనే ఉండేవాళ్లం. అప్పుడు మా అమ్మమ్మ నాకు నేలపై మలయాళం రాయడం నేర్పించింది. ఆ తర్వాత నాగ్​పూర్ షిఫ్ట్​ అయ్యాం. అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్​ వాళ్లింట్లో టీవీ ఉండేది. మేం కొంత డబ్బు పోగేసుకుని వీసీఆర్ రెంట్​కి తెచ్చుకుని వీకెండ్​లో మలయాళ సినిమాలు చూసేవాళ్లం.  1989లో మా ఇంట్లో మొదటి కలర్​ టీవీ కొన్నాం. కానీ, వీసీఆర్​ లేకపోవడం వల్ల దూరదర్శన్​ మాత్రమే చూసేవాళ్లం. ప్రతి ఆదివారం సినిమాలు వచ్చేవి. కానీ, అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేవి. అస్సామీ, బెంగాలీ.. మరాఠీ తర్వాత మలయాళం ఫిల్మ్​ వచ్చేది. అలాగే వేసవి సెలవులకి కేరళ వెళ్లేవాళ్లం. థియేటర్​లో సినిమాలు చూసేవాళ్లం. అలా మలయాళం నేర్చుకున్నా. ఇప్పుడైతే మలయాళం చాలా బాగా మాట్లాడతా.

  •  ఇంజినీరింగ్​ అయిపోయాక కార్పొరేట్​ కంపెనీలో జాబ్​ కూడా చేశా. నాకు 2005లో పెండ్లి అయింది. భార్య పేరు అనుపమ. మాకు ఇద్దరు పిల్లలు. మయూఖ, అఫ్తాబ్​. 
  •  డైరెక్టర్​ వి.కె. ప్రకాశ్​తో తొమ్మిది సినిమాలు చేశా. మిధున్ మాన్యుల్ డైరెక్షన్​లో ఐదు సినిమాలు చేశా. జయసూర్య, అసిఫ్​ అలీతో నేను ఎక్కువగా పనిచేశా. కాబట్టి నేచురల్​గానే వాళ్లతో            స్నేహం  పెరిగింది.
  • నిజానికి ఒక కొత్త యాక్టర్ ఇండస్ట్రీకి వస్తే తనకంటూ ఒక మార్కెట్​ క్రియేట్ చేసుకుంటాడు. దాంతో నాలాంటి క్యారెక్టర్​ ఆర్టిస్ట్​లకు అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి నేను లీడ్​ రోల్స్ మీద ఎక్కువ  దృష్టి పెట్టను.

::: ప్రజ్ఞ