అక్కతో ప్రేమ.. చెల్లెలికి వేధింపులు

అక్కతో ప్రేమ.. చెల్లెలికి వేధింపులు

హయత్ నగర్,వెలుగు: తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి చెల్లిలిని ఓ యువకుడు వేధించాడు. అతడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేటకు చెందిన కోట్ల మాధవ్(25) డిగ్రీ పూర్తి చేసి సిటీలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం ఓ యువతితో ఉన్న స్నేహాన్ని అదనుగా చేసుకుని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. ఆ యువతి చెల్లెలి ఫోన్ నంబర్ ను మాధవ్ సేకరించాడు. ప్లే స్టోర్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేశాడు.

ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ కి వాట్సాప్ లింక్ చేసుకున్నాడు. ఆ నంబర్ సాయంతో వాట్సాప్ లో యువతి చెల్లికి అసభ్యకర మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడు. మాధవ్ ఇలా వేధిస్తుండటంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి మాధవ్ గా తేల్చి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వేధిస్తూ ..కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటిని అవైడ్ చేసి పోలీసులకు కంప్లయింట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి