పోకిరీల బైక్ స్టంట్స్.. డేంజర్​గా రైడింగ్

పోకిరీల బైక్ స్టంట్స్.. డేంజర్​గా రైడింగ్

హైదరాబాద్‌,వెలుగు: సిటీ రోడ్లపై మళ్లీ  పోకిరీలు బైక్ స్టంట్స్ చేస్తున్నారు .  అర్ధరాత్రి సమయాల్లో ఖాళీ రోడ్లపై స్టంట్స్‌ చేస్తూ డేంజర్​గా వెళ్తూ.. వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. బైక్‌ స్టంట్స్ కోసం ఫ్లై ఓవర్స్, నెక్లెస్‌ రోడ్​, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలనే అడ్డాగా చేసుకున్నారు. సెక్రటేరియట్‌ ముందు ఉన్న ఓ పోకిరీ చేసిన స్టంట్స్‌ శుక్రవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలు తీసుకున్న పోకిరీలు.. వారి ట్విట్టర్‌‌లో దాన్ని పోస్ట్‌ చేశారు. సోషల్‌మీడియా అకౌంట్‌ ఆధారంగా ఖైరతాబాద్‌ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.