
వెలుగు, గండిపేట: రాజేంద్రనగర్లో కొందరు యువకులు అర్ధరాత్రిళ్లు రెచ్చిపోతున్నారు. 11 గంటల తర్వాత బైకులతో హైవేలపైకి చేరుకుని స్టంట్లు వేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అత్తాపూర్ పిల్లర్ నంబర్140 నుంచి 170 రోజూ ఆకతాయిలు చక్కర్లు కొడుతున్నారు. బైకులతో ఫీట్లు చేస్తూ.. ఫోన్లలో వీడియోలు రికార్డ్చేస్తున్నారు. పోలీసులు నిఘా పెడితే అరికట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. అర్ధరాత్రి టైంలో పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.