వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో జర్నీకి యూత్​ ఇంట్రస్ట్​

వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో జర్నీకి  యూత్​ ఇంట్రస్ట్​
  • ప్రయాణికుల్లో 29  శాతం మంది వారే..

సికింద్రాబాద్,  వెలుగు: దక్షిణ మధ్య  రైల్వే పరిధిలో  వందే భారత్  రైళ్లలో ప్రయాణించడానికి యువత ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.  మంగళవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం..   ప్రస్తుతం ఐదు వందే  భారత్  రైళ్లు  దక్షిణ మధ్య రైల్వే విభాగంలో  సేవలు కొనసాగిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా యువత ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని 25–34 వయసు మధ్య గల వారు దాదాపు 29.08 శాతం మంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో  ప్రయాణించారు.

35–--49 సంవత్సరాల మధ్య వయస్సు వారు సగటున 26.85 శాతం మంది ప్రయాణిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లోని  సీనియర్ సిటిజన్లు కూడా ఈ ట్రైన్ ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.   వందే భారత్‌  రైలు ప్రవేశపెట్టిన సమయం నుంచి ఇప్పటివరకు దక్షిణ భారత  రైల్వే విభాగాల్లో  మొత్తం 7.16  లక్షల మంది ప్రయాణం చేసినట్లు ఆయన తెలిపారు.

 
 

Arun Kumar Jain, General Manager of South Central Railway, said that the youth prefers to travel in Vande Bharat trains under South Central Railway.