బిగినర్స్ క్రైం : యూట్యూబ్ చూసి దోపిడీ.. అందరూ 20 ఏళ్ల కుర్రోళ్లే..

బిగినర్స్ క్రైం : యూట్యూబ్ చూసి దోపిడీ.. అందరూ 20 ఏళ్ల కుర్రోళ్లే..

యూట్యూబ్ వీడియోలు చూసి గ్యాంగ్‌స్టర్ల కార్యకలాపాలకు పాల్పడిన నలుగురు నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు జులై 31న తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నివసిస్తున్న చెందిన నలుగురు ఓ వ్యక్తి నుంచి రూ.40 లక్షలు దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. 

ఇందుకోసం అతనికి ఫోన్​ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు వారి నుంచి వాట్సప్​ కాల్​ వచ్చిందని జులై 18న బాధితుడు బిందాపుర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఉత్తమ్ నగర్‌కు చెందిన అజయ్ కుమార్ (26), ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఆశిష్ (24), లక్కీ (23), విశాల్ (22) ఇద్దరూ డాబ్రీలోని విజయ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారని వారే నిందితులుగా పోలీసులు గుర్తించారు. 

నిందితులు మొత్తంగా 8 సిమ్​కార్డులు ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో సంపన్నులే టార్గెట్​గా దోపిడీలకు పాల్పడేవారని డీసీపీ హర్షవర్ధన్​ తెలిపారు. వీరంతా పథకం ప్రకారం దోపీడీలు చేసేవారన్నారు. నిందితులందర్నీ పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

ప్రధాన నిందితుడు అజయ్​కుమార్​ తాను యూట్యూబ్​లో క్రిమినల్​ ముఠాల దోపిడీ కాల్స్​వీడియోలు చూసి నేరాలు చేస్తున్నట్లు అంగీకరించారు. బాగా స్థిరపడిన వ్యాపారులే టార్గెట్​గా పని చేస్తున్నట్లు నిందితులు చెప్పడం కాప్స్​ని నివ్వెరపరిచింది.