ఈ తిక్కకు.. 3 కోట్ల లెక్కుంది.. దానికో వ్యాపారం ఉంది

ఈ తిక్కకు.. 3 కోట్ల లెక్కుంది.. దానికో వ్యాపారం ఉంది

russian youtuber mikhail litvin : బిజినెస్.. బిజినెస్.. బిజినెస్.. వ్యాపారం చేసిది డబ్బు కోసం.. ఎంత ఎక్కువ డబ్బుతో ప్రమోషన్ చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి.. ఇది బేసిక్ సూత్రం.. డిజిటల్ ప్రపంచంలో మాత్రం వైవిధ్యమైన ప్రమోషన్ అవసరం.. ఎంత తిక్కగా.. ఎంత పిచ్చిగా.. ఎంత ఊహించని విధంగా.. క్రియేటివీటితో ఆలోచిస్తావో అంత వైరల్ అవుతుంది.. పాపులారిటీ వస్తుంది. అందరూ తిక్క అనుకుంటున్న ఈ యూట్యూబర్ ప్రమోషన్ గురించి ఔరా అంటారు..

రష్యాలో మైఖల్ లిట్విన్ అనే యూట్యూబర్ ఉన్నాడు.. ఈడు చేసే చిత్రవిచిత్రాలు అన్నీ ఇన్నీ కావు.. రెండేళ్ల క్రితం మెర్సిడెజ్ రెండున్నర కోట్ల విలువైన బెంజ్ కారును పెట్రోల్ పోసి తగలబెట్టి.. ఆ మంటలు చూస్తూ.. చిప్స్ తింటూ ఎంజాయ్ చేశాడు.. అప్పల్లో ఇదో సంచలనం.. ఇప్పుడు కూడా అలాంటి పనే చేశాడు. కాకపోతే ఈసారి ఎనర్జీ డ్రింగ్ ప్రమోషన్ కోసం మూడు కోట్ల రూపాయల విలువైన లంబోర్టి కారును ( Lamborghini) ముక్కలు ముక్కలు చేశాడు. ఇదిలె చేశాడు అనే చూద్దాం..

తన లంబోర్టిని వైట్ కలర్ కారు నిండా లిట్ ఎనర్జీ డ్రింక్ బాటిల్స్ నింపాడు.. దాన్ని ఓ క్రేన్ కింద పెట్టాడు. 100 అడుగుల ఎత్తు నుంచి కారుపై పెద్ద ఇనుప దిమ్మెను కిందకు వదిలాడు.. అంతే ఎనర్టీ డ్రింక్ లో నిండి ఉన్న కారుపై పడి.. డ్రింక్ ఎంతా ఎగసి పడింది. కారు ముక్కలు ముక్కలు అయ్యింది. మూడు కోట్ల రూపాయల విలువైన కారు ఇలా ముక్కలు చేయటం ఏంటీ అని అందరూ మైఖల్ లిట్విన్ ను తిట్టిపోస్తున్నా.. ప్రపంచ వ్యాప్తంగా అతని వచ్చిన పాపులారిటీ.. ఎనర్జీ డ్రింక్ కు వచ్చిన ప్రమోషన్ మాత్రం అదుర్స్ అంటున్నారు వ్యాపారవేత్తలు. 

ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ వీడియోకు యూట్యూబ్ లో 7 లక్షల లైక్స్ వస్తే.. ఇన్ స్టాలో 15 లక్షల మంది చూశారు.. ఇక ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా అతనికి బీభత్సమైన పబ్లిసిటీ వచ్చేసింది. రష్యాలో అయితే లిట్విన్ ఎనర్జీ డ్రింక్ ఏంటీ అనే చర్చ మొదలైంది.. ఆల్ రెడీ చాలా మంది ఎలా ఉందని టేస్ట్ కూడా చేశారంట.. ఈ వీడియోపై సామాన్యులు మాత్రం పిచ్చి పని అని.. మూడు కోట్ల కారును అలా ఎలా ముక్కలు చేస్తారంటూ సూక్తులు చెబుతున్నా.. వ్యాపార ప్రపంచం మాత్రం.. మూడు కోట్లతో.. 300 కోట్ల పబ్లిసిటీ వచ్చిందంటోంది.. 

అప్పట్లో తన కారు తరచూ రిపేర్ వస్తుందంట.. మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టి ఆ కంపెనీ బ్రాండ్ వ్యాల్యూపై ఎఫెక్ట్ చూపించిన లిట్విన్.. ఇప్పుడు లంబోర్టిన్ కారుతో.. తన ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ కోసం ముక్కలు చేశాడు.. ఏది ఏమైనా లిట్విన్ బ్రెయిన్ మాత్రం అదుర్స్ అంటున్నారు నెటిజన్లు..