కార్యకర్తల కోసం యాప్.. జగన్ సంచలన నిర్ణయం..

కార్యకర్తల కోసం యాప్.. జగన్ సంచలన నిర్ణయం..

వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే పార్టీ తరపున యాప్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు జగన్. మంగళవారం ( జులై 29 ) వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ సమావేశంలో పాల్గొన్న జగన్ ఈమేరకు సంచలన ప్రకటన చేశారు. పార్టీ తరపున త్వరలోనే ఒక యాప్ రూపొందిస్తామని.. కూటమి ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా యాప్ లో నమోదు చేసుకోవచ్చని అన్నారు జగన్. ఎవరైనా వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఇబ్బంది పెట్టినా.. ఆధారాలతో సహా యాప్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని తెలిపారు జగన్.

యాప్ ద్వారా ఇచ్చిన కంప్లైంట్ ఆటోమేటిక్ గా డిజిటల్ సర్వర్ లోకి వస్తుందని.. వైసీపీ అధికారంలోకి రాగానే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు జగన్. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైనవారంతా యాప్ ద్వారా ఫిర్యాదు చేయచ్చని.. ఆధారాలుగా వీడియోలు, డాకుమెంట్స్ అప్ లోడ్ చేయచ్చని తెలిపారు జగన్.

Also read:-ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. మాజీ సీఎం జగన్ ఇలాఖాలో కూడా !

ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని హెచ్చరించారు జగన్. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోందని.. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు జగన్. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని... ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో ఎవ్వరూ ఉండరని.. అందరూ జైళ్లకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు జగన్.

వైసీపీ  సీనియర్లందర్నీ తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని.. మిథున్‌రెడ్డి అరెస్టు బాధాకరమని అన్నారు. మిథున్‌ రెడ్డి, గౌతం రెడ్డిని రాజకీయాల్లో తన ద్వారా వచ్చారని అన్నారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే తనకు ఎక్కువ సాన్నిహిత్యం ఉందని స్పష్టం చేశారు జగన్. రాష్ట్రంలో అంశాలకు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు జగన్. మిథున్‌ తండ్రి పెద్దిరెడ్డి ..ఆ శాఖను కూడా చూడలేదని.. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారని అన్నారు జగన్.

చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గమని.. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారని అన్నారు. 
తర్వాత ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరి.. చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడని ఎద్దేవా చేశారు. కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడని అన్నారు. చంద్రబాబుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంట్లో నలుసులా మారాడని.. భాస్కర్‌ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడని అన్నారు జగన్. భాస్కర్‌ కొడుకు మోహిత్ రెడ్డి లండన్‌లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు జగన్.

 సందిగం సురేష్‌, గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారని.. కాకాని గోవర్ధన్‌మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారని అన్నారు.టోల్‌గేట్ల దగ్గర కూడా ఫీజులు వసూలు చేశారని తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. లేని అక్రమాలు చూపించి… తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జగన్. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు జగన్.