జగన్.. ఇది మీ చేతకాని కమిట్మెంట్.. షర్మిల కౌంటర్..!

జగన్.. ఇది మీ చేతకాని కమిట్మెంట్.. షర్మిల కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ కి విశాఖనే రాజధాని అని, వచ్చే ఎన్నికల్లో గెలిచాక విశాఖలోనే తన ప్రమాణస్వీకారం ఉంటుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు." పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ ." అని ఎద్దేవా చేశారు.

ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్.గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ?అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

ALSO READ :- ఈ తేదీల్లోనే.. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు