మా కూతురు పెళ్లి రిసెప్షన్ కు రండి.. సీఎం రేవంత్ కు వైఎస్ షర్మిల ఆహ్వానం

మా కూతురు పెళ్లి రిసెప్షన్ కు రండి.. సీఎం రేవంత్ కు వైఎస్ షర్మిల ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ  పీసీసీ  చీఫ్ వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని రేవంత్ ను ఆహ్వానించారు. ఈ మేరకు రిసెప్షన్ ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేశారు. 

వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డి వివాహ రిసెప్షన్ డిసెంబర్ 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

షర్మిల కూతురు వైఎస్ అంజలి రెడ్డి సోమల రఘురాం రెడ్డిల వివాహం నవంబర్ 25న జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవన్నారు.