వివేక హత్య కేసు : హరిత హోటల్‌లో సిట్ విచారణ

వివేక హత్య కేసు : హరిత హోటల్‌లో సిట్ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు సిట్ అధికారులు. హత్య జరిగిన రోజు రాత్రి కడపలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిశారు కొమ్మ పరమేశ్వర్ రెడ్డి. ఈ హత్య కేసులో మొదటి నుంచి పరమేశ్వర రెడ్డిని కీలక  నిందితునిగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య జరిగిన రోజు గుండెపోటుతో కడపకు వచ్చారు పరమేశ్వర రెడ్డి. అదే రోజు హరిత హోటల్ లో బీటెక్ రవిని కలిశారు పరమేశ్వర రెడ్డి. ఇదే అంశంపై హరిత హోటల్ సిబ్బందిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఎందుకు పరమేశ్వర రెడ్డి బిటెక్ రవిని కలవాల్సి వచింది.

ఈ భేటీలో ఎం చర్చించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. హరిత హోటల్ లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన మార్చ్ 14న హరిత హోటల్ రూమ్ నంబర్ 104లో బీటెక్ రవి బస చేసినట్లు సమాచారం.హోటల్ లో బీటెక్ రవిని కలిసిన తర్వాతే పరమేశ్వర రెడ్డి ఛాతి నొప్పితో కడపలో ప్రయివేట్ హాస్పిటల్ లో చేరారు. హరిత హోటల్ సిసి ఫుటేజ్ ఇవ్వాలని మేనేజర్ కిషోర్ ను కోరారు అధికారులు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ నేతృత్వంలో 5 మంది సిఐలు, 2 ఎస్సైలతో హరిత హోటల్ విచారణ చేపట్టారు.