వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.  వైఎస్ఆర్ తమ్ముడు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. 1989, 1994లలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా… 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు.

వైఎస్ఆర్ మరణాంతరం రాష్ట్రమంత్రివర్గంలో చేరిన వివేకా.. కొంత కాలం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.  వివేకానంద రెడ్డి హఠాన్మరణంతో వైఎస్ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.