
అమరావతి: ఏపీ పదో తరగతి ఫలితాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో జీరో రిజల్ట్ రావడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో జూమ్ యాప్ లో సమావేశామయ్యారు. అయితే లోకేశ్ మాట్లాడుతుండగా మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడెన్ గా జూమ్ లో ప్రత్యక్షమయ్యారు. లోకేశ్ తో మాట్లాడేందుకు వాళ్లిద్దరూ ఎంతో ప్రయత్నించారు. అయితే ఇది గమనించిన జూమ్ నిర్వాహకులు జూమ్ లైవ్ ను కట్ చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతల ఎంట్రీపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఐడీలతో లైవ్ లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. అనంతరం వంశీ, నాని జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఫొటోలను లోకేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.