YSR విగ్రహం ధ్వంసం… వైసీపీ నాయకుల ధర్నా

YSR విగ్రహం ధ్వంసం… వైసీపీ నాయకుల ధర్నా

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలదాసిపల్లి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన  YSR విగ్రహం ధ్వంసమైంది.  శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం తలను తొలగించారు. దీంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.  44వ జాతీయ రహదారిపై YCP నాయకులు ధర్నా చేపట్టారు. విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.