అమరవీరుల త్యాగం.. కల్వకుంట్ల వారి భోగం : వైఎస్ షర్మిల

అమరవీరుల త్యాగం.. కల్వకుంట్ల వారి భోగం : వైఎస్ షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సిద్ధిపేట మంత్రి కేటీఆర్ గురువారం (జూన్ 15వ తేదీన) చేసిన కామెంట్స్ పై స్పందించారు. 

‘‘ వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట!
దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకుండెనట. 
ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట!’’
అంటూ కామెంట్స్ చేశారు షర్మిల. 

కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. 1200 మంది అమరుల త్యాగాలపై రాజ భోగాలు అనుభవిస్తూ.. రాష్ట్ర సంపదను దోచుకుతింటున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులను.. సకల జనులను అవమానించడమే మీ సంస్కారమా..?  అని ప్రశ్నించారు.

తెలంగాణ చరిత్రను, త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని వైఎస్ షర్మిల చెప్పారు. స్వరాష్ట్రంలో అమరులకు గుర్తింపు లేదని, వస్తాయనుకున్న ఉద్యోగాలు రాలేదన్నారు.

‘‘ఉద్యోగులకు జీతాలు లేవు. కార్మికులకు హక్కులు లేవు.
ప్రశ్నించే హక్కును రద్దు చేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ...
బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుత అంటే కానీ బ్రతకలేని పరిస్థితి.
ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టి..
తెలంగాణ పదాన్ని పార్టీ నుంచే తుడిపేసి..
జై తెలంగాణ అంటే.. నై తెలంగాణ అని చెప్తున్న పెద్ద తెలంగాణ ద్రోహి కేసీఆర్. 
ఇక తనది పార్టీ కాదని మిషన్ అని చెప్తున్న దొర..మీది పార్టీ అని ఎవరన్నారు ? ’’
అంటూ ట్విట్టర్ లో ఆరోపించారు వైఎస్ షర్మిల.

https://twitter.com/realyssharmila/status/1669636777232171010