గుంటూరు ఎంపీ సీటులో ట్విస్ట్ : ఊహించని అభ్యర్థికి టికెట్ ఇచ్చిన జగన్..!

గుంటూరు ఎంపీ సీటులో ట్విస్ట్ : ఊహించని అభ్యర్థికి టికెట్ ఇచ్చిన జగన్..!

2024 ఎన్నికల్లో 175 కి 175స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నాడు సీఎం జగన్. ప్రత్యర్థి పార్టీలకంటే ముందుగా నియోజకవర్గ ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ చాలా అభ్యర్థులను మారుస్తూ తన మార్క్ పాలిటిక్స్ ని చూపిస్తున్నాడు. ఒంగోలు, నర్సరావుపేట వంటి స్థానాలను నాన్ లోకల్స్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు కేటాయించి షాక్ ఇచ్చిన జగన్ గుంటూరు ఎంపీ నియోజకవర్గ కేంద్రంగా మరో ట్విస్ట్ ఇచ్చాడు జగన్.

తాజాగా వైసీపీ విడుదల చేసిన 8వ జాబితాలో గుంటూరు ఎంపీ స్థానాన్ని కిలారు రోశయ్యకు ప్రకటించింది. గుంటూరు ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నఉమ్మారెడ్డి వెంకటరమణను కాదని పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కేటాయించటం హాట్ టాపిక్ గా మారింది. 2014, 2019ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా టీడీపీ నుండి గల్లా జయదేవ్ గెలుపొందగా ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.

ఇంకా ఈ లిస్ట్ లో జీ.డీ నెల్లూరు స్థానానికి కుళత్తూరు కృపలక్ష్మి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, పొన్నూరు స్థానానికి అంబటి మురళిలను అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయటంలో జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరికీ అర్థం కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.