వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 50 వ రోజుకి చేరింది. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం షర్మిల యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..మహానేత YSR ఇదే రోజున 2003లొ పాదయాత్ర ప్రారంభించారన్నారు. 1500 కి.మీ పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు చూపారన్నారు. గతేడాది ఇదే రోజు ఖమ్మం సభలో తన రాజకీయ ప్రస్థానానికి పునాది పడిందన్నారు. నేటి ప్రజాప్రస్థానం 50 రోజులు పూర్తైన శుభదినం కూడా ఇదేనన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవుసాన్ని పండుగ చేస్తామన్నారు. కౌలు రైతులు, కూలీలను ఆదుకుంటామని.. మహిళలను ఆర్థికంగా నిలబెడతామన్నారు. మహిళల పేరు మీద ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను అద్భుతంగా నడిపిస్తామన్నారు. ఇంట్లో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు.పోడు భూములకు పట్టాలిస్తామన్నారు షర్మిల.
సువర్ణయుగ ఆరంభానికి 19 ఏండ్లు.మహానేత YSR ఇదేరోజున 2003లొ పాదయాత్ర ప్రారంభించారు. 1500KM పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు చూపారు. గతేడాది ఇదేరోజు ఖమ్మం సభలో నా రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది.నేటి ప్రజాప్రస్థానం 50 రోజులు పూర్తైన శుభదినం కూడా ఇదే.
— YS Sharmila (@realyssharmila) April 9, 2022
1/2 pic.twitter.com/kfbdSaOerv
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో అగ్రిమెంట్ సై సంతకం చేసిన కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ తన ముక్కు నేలకు రాసి.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం యాత్ర చేస్తున్న షర్మిల.. పాపట్ పల్లిలో ధర్నా చేశారు.
