కొడుకు పేరు, ఫోటోను రివీల్ చేసిన యూవీ

కొడుకు పేరు, ఫోటోను రివీల్ చేసిన యూవీ

టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన కొడుకు పేరు, ఫోటోను రివీల్ చేశారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తన భార్య, కుమారుడితో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు యువీ. "ఈ ప్రపంచంలోకి ఓరియన్ కీచ్ సింగ్‌కు స్వాగతం. అమ్మానాన్నలకు ఈ చిన్ని పుత్రుడంటే చాలా ప్రేమ. కోట్లాది నక్షత్రాల మధ్య  నీ పేరు జిగేలుమన్నట్లే.. నువ్వు నవ్వినప్పుడల్లా నీ కళ్లు మెరుస్తాయి" అని యూవీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, 2011లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్ ఇద్దరికీ ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్ళి వైపు దారి తీసింది. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకోగా ఈ జంట ఈ ఏడాది జనవరి 25న మగబిడ్డకు జన్మనిచ్చారు.