100 బెడ్లతో యువరాజ్‌సింగ్‌ ఫౌండేషన్‌ కరోనా ఆస్పత్రి

100 బెడ్లతో యువరాజ్‌సింగ్‌ ఫౌండేషన్‌ కరోనా ఆస్పత్రి

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌..కరోనా పేషెంట్లను ఆదుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్ బారిన పడి..ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో వారి కోసం ప్రత్యేకంగా.. 100 బెడ్లతో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ ఆస్పత్రిని యువరాజ్‌సింగ్‌ ఫౌండేషన్‌ నిర్మించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీ డీన్‌ సంజరు దీక్షిత్‌ తెలిపారు.

 యువరాజ్‌ సింగ్‌ ఫౌండేషన్‌ నుంచి తమకు ఓ లేఖ అందిందని, మూడున్న కోట్లతో..100 బెడ్లతో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు యువీ ఫౌండేషన్‌ ఆ లేఖలో తెలిపినట్లు సంజరు దీక్షిత్‌ తెలిపారు. అయితే ఆ హాస్పిటల్‌ నిర్మాణం కోసం వారు 30 రోజుల టైం కోరినట్లు చెప్పారు. యువీ ఫౌండేషన్‌ పంపిన లేఖను ఆమోదించినట్లు ఎంజీఎం మెడికల్‌ కాలేజీ డీన్‌ సంజరు దీక్షిత్‌ తెలిపారు.