జిన్పింగ్తో శాంతి చర్చలకు సిద్ధమన్న జెలెన్స్కీ

జిన్పింగ్తో శాంతి చర్చలకు సిద్ధమన్న జెలెన్స్కీ

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చల కోసం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను భేటీ కావాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆయుధాలను రష్యాకు పంపకపోవచ్చని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ యుద్ధాన్ని తప్పించేందుకు, రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండే అంశంపై ఆ దేశ అధ్యక్షునితో చర్చిస్తానని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తై సందర్భంగా మీడియాతో మాట్లాడిన జెలెన్స్కీ ఈ విషయాలు వెల్లడించారు. ఇదిలా ఉంటే చైనా చేసిన శాంతి ప్రతిపాదనలో ఉక్రెయిన్ నుంచి రష్యా దళాల ఉపసంహరణపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జిన్ పింగ్ ను కలిసేందుకు జెలెన్సీ సిద్ధంగా ఉన్నా.. అటు చైనా మాత్రం ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. మరోవైపు చైనా శాంతి ప్రతిపాదనను రష్యా స్వాగతించింది.