
పెరుగుతున్న ఆర్థిక మోసాల మధ్య ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకులు, సీఈవో నితిన్ కామత్ భారత్ లో వివిధ ఆర్థిక స్కామ్ ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్ లు , హై రిటర్న్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లు, క్రిప్టో ఇన్వెస్ట్ మెంట్ స్కీంల వంటి వాటి ద్వారా ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించారు.
పిగ్ బట్చరింగ్ స్కామ్ అంటే..
పందుల కసాయి స్కామ్.. అనేది నకిలీ జాబ్ ఆఫర్ స్కామ్ లు, నకిలీ క్రిప్టో పెట్టుబడులు, అధిక పెట్టుబడి స్కీమ్ ల వంటి వాటిని అమలు చేయబడిన వివిధ స్కామ్ లకు విస్తృత పదం. భారత్ లో పిగ్ బట్చరింగ్ స్కామ్ లో పదివేల కోట్ల వరకు మోసాలు జరిగాయి.. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్ లు, స్కామ్మీ హై రిటర్న్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లు , క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్లు వంటితో ఎంతోమంది మోసాల బారిన పడ్డారని జెరోధా సీఈవో నితిన్ కామత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో నేరగాళ్లు ఫ్రెండ్ గా, లవర్ గా వ్యవహరిస్తారు... బాధితుడికి నమ్మకం కలిగించాక.. నకలీ పెట్టుబడులు, నకిలీ ఉద్యోగాల పేరుతో వారిని మోసం చేసి డబ్బుతో పారిపోతారు. ఇందుకోసం నేరగాళ్లు ముందుగా వారికి పూర్తిస్థాయిలో నమ్మిస్తారు.. ఆ తర్వాత మోసం చేస్తారు అని నితిన్ కామత్ అన్నారు.
పిగ్ బట్చరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది..
నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్ ను వినియోగించడం ద్వారా ముందుకు వినియోగదారులు నమ్మకాన్ని పొందుతారు. స్నేహం, ప్రేమ పేరుతో నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత వారి పని ముగించుకొని కనబడకుండా పోతారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్కామ్ లు ఉన్నాయి. వీటికి పరిధిని ఊహించలేం. ఈ స్కామ్ లో దారుణమైన విషయం ఏంటంటే.. స్కామ్ చేసే వ్యక్తి కూడా మరొకరి చేతిలో మోసం పోవడం. చాలామంది స్కామీ కంపెనీలనుంచి ఫేక్ ఉద్యోగ ఆఫర్లు పొంది విదేశాలకు వెళతారు. వారు అక్కడ బందీలుగా ఉండి నకిలీ ఫేక్ ఫ్రొఫైల్ లతో ఇతరులను నమ్మించి మోసం చేయాల్సి వస్తుందని నితిన్ కామత్ తెలిపారు.
పిగ్ బచ్చరింగ్ స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి ..
1.వాట్సప్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు డేటింగ్ యాప్ లలో తెలియని మేసేజ్ లకు ఎప్పుడూ రెస్పాన్స్ ఇవ్వొద్దు.
2.ఎవరైనా మిమ్మల్ని కొత్త కొత్త యాప్ లను డౌన్ లోడ్ చేసుకోమని లేదా లింక్ లను ఓపెన్ చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. అవి మిమ్మల్ని రెడ్ జోన్ పడేయొచ్చు.
3.ఈ స్కామ్ లలో నేరగాళ్లు .. భయాలు,యాంబిషన్స్, దురాశ వంటి మీ భావోద్వేగాలను క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తారు. ఎప్పుడు తొందరపడి స్పందించవద్దు.
4.హడావుడిగా మేసేజ్ లకు స్పందించడం వల్లే ఈ స్కామ్ ల బారిన పడతారు.
5. ఏవైనా సందేహాలుంటే మీ సమీప పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం, లాయర్ల సలహాలు తీసుకోవడం గానీ చేయాలి.
6.ఎవరైనా ఉద్యోగం లేదా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అని హామీ ఇస్తే అది తప్పనిసరిగా స్కామ్ కు సంబంధించిన మేసేజ్ గానే గుర్తించాలి.
7.మీ ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ వంటి వ్యక్తిగత సమాచారం, లేదా బ్యాంక్ వివరాలు, పెట్టుబడి వివరాలు వంటి ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయొద్దు.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆన్ లైన్ సైబర్ నేరగాళ్ల మోసాలనుంచి మనం బయటపడొచ్చు.
ALSO READ : అమెరికాలోనే చదవాలి.. ఇండియన్ స్టూడెంట్ల చాయిస్ ఇదే!