
హరారే: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న జింబాబ్వే.. అఫ్గానిస్తాన్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్ట్‌లో ఇన్నింగ్స్ 73 రన్స్ తేడాతో విజయం సాధించింది. 12 ఏండ్ల సుదీర్ఘ తర్వాత జింబాబ్వేకు లభించిన తొలి టెస్ట్ విజయం ఇదే కావడం విశేషం. 34/1 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 159 రన్స్‌కే కుప్పకూలింది. ఇబ్రహీం జద్రాన్ (42) టాప్ స్కోరర్. బహీర్ షా (32) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. అఫ్సర్ జజాయ్ (18), ఇస్మాత్ ఆలమ్ (16), యామిన్ అహ్మద్‌జాయ్ (13 నాటౌట్) రెండంకెల స్కోరు అందుకున్నారు. ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రిచర్డ్ ఎంగ్రవా (5/37) ఐదు, ముజురబాని 3, చివాంగ 2 వికెట్లు తీశారు. అంతకుముందు అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 127 రన్స్‌కే ఆలౌట్‌కాగా, జింబాబ్వే 359 రన్స్ చేసింది. బెన్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.