
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లలో ఒకటైన జితారా.ఏఐ తమ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వైస్‌ప్రెసిడెంట్‌గా రవి భూషణ్ ఓజాను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ జ్యూయలరీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్థిరాస్తి, వెల్నెస్, లగ్జరీ, మోడరన్ రిటైల్ వంటి సంస్థలకు ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీలను అందిస్తుంది. కస్టమర్ అక్విజిషన్, సపోర్ట్ ఆటోమేషన్ వంటి వాటిపై రవి దృష్టి సారిస్తారు. ఆయనకు ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఆధారిత సాస్ వంటి టెక్నాలజీల్లో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని జితారా తెలిపింది.