ఫుడ్ ప్యాకింగ్ కు 60 రూపాయలా.. జొమాటోపై నెటిజన్లు ఫైర్

ఫుడ్ ప్యాకింగ్ కు 60 రూపాయలా.. జొమాటోపై నెటిజన్లు ఫైర్

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తరుణంలో ఏమి కావాలన్నా.. ఇంట్లో కూర్చుని పొందగలుగుతున్నారు. కేవలం వస్తువులు మాత్రమే కాకుండా, ఫుడ్ కూడా ఉన్న చోటికే ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు బిల్లు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు  తెలుసుకుందాం.

ఒక మహిళ Zomatoలో ఫుడ్ ఆర్డర్ చేసింది.  తనకు బాగా ఆకలిగా ఉందని ....జొమాటోలో మూడు రోటిలు ఆర్డర్ చేసుకుంది. అంతే తనకు వచ్చిన డెలివరీ బిల్లు చూసి షాక్ అయింది. మూడు ప్లేట్ల దూదీ తెప్లా(రోటీ) రూ.180 బిల్లు కాగా..కేవలం ఫుడ్ ప్యాకింగ్  కంటైనర్ ఛార్జీలను రూ.60గా పేర్కొంటూ బిల్లు వేశారు.  అది చూసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ Zomatoను సోషల్ మీడియా వేదికగా  దీనిపై . దీంతో ఆవేదన చెందిన ఆ మహిళ ఫుడ్‌ కంటైనర్‌ వసూలు ఛార్జీలు ఇంత చేస్తున్నారెంటని సోషల్ మీడియా వేదికగా జొమాటోను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీంతోపాటు ఆమె తన బిల్లు స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. మితిమీరిన, అన్యాయమైన కంటైనర్ ఛార్జీపై తాను అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఫుడ్ డెలివరీ కంపెనీ దీనిపై వివరణ ఇవ్వాలని గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన ఖుష్బూ ఠక్కర్ డిమాండ్ చేసింది.

దీనిపై జొమాటో స్పందించింది. కంటైనర్‌ ఛార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని స్పష్టం చేసింది. హాయ్ ఖుష్బూ.. పన్ను విధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది.. ఆర్డర్ చేసిన ఫుడ్ కు అనుగుణంగా 5 శాతం 18 శాతం పన్ను ఛార్జీలుంటాయి.. దీంతోపాటు రెస్టారెంట్లు ప్యాకేజీ ఛార్జీలను విధిస్తాయనే విషయాన్ని గుర్తెరగాలి.. ఈ మార్గంలో కూడా వారు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని తెలుసుకోవాలంటూ జొమాటో బదులిచ్చింది.

 ఖుష్బూకు జొమాటో ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఆర్డర్ చేసేముందు ప్యాకేజీ ఛార్జీలు చేసుకొని ఉండాల్సింది అంటున్నారు. అయితే దీనిపై రియాక్ట్ అయిన ఖుష్బూ కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా కంటైనర్‌లను అందించడం రెస్టారెంట్ బాధ్యత కాదా అంటూ ప్రశ్నించారు. ఇది చూసిన పలువురు ఖుష్బూతో ఏకీభవించగా.. రెస్టారెంట్ అటువంటి ఛార్జీలు విధించదని మరికొంత మంది అంటున్నారు..