మరీ ఓవర్ అనిపిస్తలా : ధూమ్ బైక్, హీరోయిన్ ఫేస్.. డెలివరీ గర్ల్ అంట..

మరీ ఓవర్ అనిపిస్తలా : ధూమ్ బైక్, హీరోయిన్ ఫేస్.. డెలివరీ గర్ల్ అంట..

ధూమ్ బైక్.. అంటే కాస్ట్లీ బండి అని.. ఆ బండి చూస్తే మూడు, నాలుగు లక్షలు ఉంటది.. ఆ బండిపై ఓ యువతి.. ఆమె ఏమైనా సాధారణంగా ఉన్నారా అంటే అదీ కాదు.. హీరోయిన్ లెక్క ఉన్నది ఆ అమ్మాయి.. ఇక డ్రస్ అంటారా.. సినిమా హీరోయిన్స్ లెక్క ఎంతో శుభ్రంగా.. నీట్ గా వేసుకున్నారు... అలాంటి అమ్మాయి ఎక్కితేనే వారేవా అంటాం.. అదే అమ్మాయి బండి వెనక జుమాటో డెలివరీ బాక్స్ ఉంటే.. చూడటానికి ఔరా అనిపిస్తున్నా.. వార్త వైరల్ అయినా.. వీడియో ట్రెండింగ్ అయినా.. ఇదేదో పబ్లిసిటీ డ్రామా అన్నట్లు నెటిజన్లు రియాక్ట్ కావటం విశేషం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫుడ్ డెలివరీ చేస్తోన్న ఓ యువతికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు. జొమాటో టీషర్ట్ వేసుకుని బ్యాగ్ కూడా పెట్టుకుని మహిళ బైక్ నడుపుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఆమె హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని జొమాటో మార్కెటింగ్ హెడ్ ఆలోచన ఇది అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ అవుతోంది. ఈ వీడియో ఇండోర్‌లోని విజయనగర్‌కి చెందినదని పలువురు తెలిపారు.

'జొమాటోకు సంబంధం లేదు'

ఈ విషయంపై స్పందించిన దీపిందర్ గోయల్.. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో జొమాటోపై వస్తోన్న వాదనలను ఖండించారు. జొమాటోకు దీనితో ఎలాంటి సంబంధం లేదని, ఇండోర్‌లో తమకు ఎలాంటి మార్కెటింగ్ హెడ్ లేదని, హెల్మెట్ లేని రైడింగ్‌ను జొమాటో ప్రోత్సహించదని ఆయన అన్నారు. జొమాటో కోసం ఆహారాన్ని డెలివరీ చేస్తున్న మహిళలు వందల సంఖ్యలో ఉన్నారని ఆయన చెప్పారు. జొమాటో కోసం ఆహారాన్ని డెలివరీ చేయడం ద్వారా వారి జీవనోపాధిని, వారి కుటుంబాల కోసం సంపాదించడంపై మట్లాడిన దీపిందర్.. తమ పని తీరు పట్ల గర్విస్తున్నామని చెప్పారు.

"ఇండోర్ జొమాటో మార్కెటింగ్ హెడ్‌కి ఈ ఆలోచన వచ్చింది. అతను ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ఖాళీ జొమాటో బ్యాగ్‌తో తిరిగేందుకు ఒక మోడల్‌ను నియమించుకున్నాడు. జొమాటో రోల్‌లో ఉంది" అంటూ వీడియో ఈ షేర్ అవుతోంది. దీనికి ప్రతిస్పందనగా దీపిందర్ గోయల్.. "హే! దీనితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము హెల్మెట్ లేని బైకింగ్‌ను ఆమోదించము. అలాగే, మాకు 'ఇండోర్ మార్కెటింగ్ హెడ్ కూడా లేదు" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

"ఇది మా బ్రాండ్‌లో కేవలం ఫ్రీ-రైడింగ్" అని అనిపిస్తుందని కూడా దీపిందర్ చెప్పారు. మహిళలు ఫుడ్ ను డెలివరీ చేయడంలో తప్పేం లేదు. వారి కుటుంబాలకు పోషించేందుకు వందలాది మంది మహిళలు  ప్రతిరోజూ ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఇందుకు మేం గర్విస్తున్నాం" అని ఆయన తెలిపారు.