ఐడియా అదిరిందిగా : జుమాటో క్యాటరింగ్ సర్వీస్.. 50 మందికి ఒకేసారి..

ఐడియా అదిరిందిగా : జుమాటో క్యాటరింగ్ సర్వీస్.. 50 మందికి ఒకేసారి..

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం జుమాటో గురించి అందరికి తెలిసిందే..మనకు ఫుడ్ కావాల్సినప్పుడు..ఇష్ట మైన వంటకాలను ఆర్డర్ చేసుకోవాలనుకున్నపుడు ఆన్ లైన్ ఆర్డర్ చేశామా..వెంటనే మనముందుంచుతుంది జుమాటో.అయితే ఇప్పటివరకు ఇద్దరు ముగ్గురికి సరిపడా మాత్రమే ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసే ఈ ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం..ఇప్పుడు ఏకంగా 50 మందికి కూడా ఒకేసారి ఫుడ్ డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఓ 50 మందికి ఒకేసారి ఫుడ్ డెలివరీ చేస్తుంది. అంటే పార్టీలు, ఈవెంట్ల కు కూడా ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. 

ఇండియాలో లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను మొదటి ప్రారంభిస్తున్నట్లు జుమాటో సీఈవో చెప్పారు. పెద్ద పెద్ద ఆర్డర్లను డెలివరీ చేసేందుకు జుమాటో ఆల్ ఎలక్ట్రిక్ ఫ్లీట్ ఈవీ వెహికల్  ఉపయోగిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను మంగళవారం (ఏప్రిల్ 16)  సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో షేర్ చేశారు.ఈ జుమాటో ఫుడ్ డెలివరీ వెహికల్స్ లో ఫ్రిజ్ కంపార్ట్ మెంట్లు, ఆహార పదార్థాలను వేడివేడిగా డెలివరీ చేసేందుకు హాట్ బాక్సులు ఉంటాయని తెలిపారు.