చిల్లీ మిస్టేక్ కు.. ఘాటుగా రిప్లై : జొమాటో, మెక్‌డొనాల్డ్‌లకు రూ. లక్ష ఫైన్

చిల్లీ మిస్టేక్ కు.. ఘాటుగా రిప్లై : జొమాటో, మెక్‌డొనాల్డ్‌లకు రూ. లక్ష ఫైన్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో అక్టోబర్ 13న వెజ్(శాఖాహారం) ఆర్డర్‌కు బదులుగా మాంసాహారాన్ని డెలివరీ చేసింది. అందుకు గానూ జోధ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరమ్ కీలక నిర్ణయం వెలువరించింది. ఆ రెస్టారెంట్ కు భాగస్వామి అయిన మెక్‌డొనాల్డ్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించింది.

"మానిటరీ పెనాల్టీ, లిటిగేషన్ ఖర్చు జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌లు సంయుక్తంగా, ప్రత్యేకంగా భరించాలి" అని వినియోగదారుల ఫోరమ్ జోడించింది. అయితే "ప్రస్తుత వ్యాజ్యం శాఖాహార ఆహార పదార్థాల స్థానంలో మాంసాహార ఆహార పదార్థాలను తప్పుగా డెలివరీ చేశారనే ఆరోపణకు సంబంధించినది" అని కంపెనీ తెలిపింది. జొమాటో అనేది కేవలం ఆహార విక్రయానికి ఫెసిలిటేటర్ మాత్రమేనని, దాని సేవల్లో ఏదైనా లోపం లేదా నాణ్యత లేకపోవడం వంటి వాటికి రెస్టారెంట్ భాగస్వామి బాధ్యత వహిస్తారని స్పష్టం చేసింది.

ఇదే తరహాలో లక్నోలోని ఒక చైనీస్ రెస్టారెంట్‌పై కేసు బుక్ అయింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక కుటుంబానికి చిల్లీ పనీర్ కి బదులుగా చిల్లీ చికెన్ అని పంపినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదైంది.

ALSO READ:మంచి అవకాశం.. చంద్రయాన్-3 మహా క్విజ్ కు గడువు పెంపు