జొమాటోలో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు ఏంటంటే..

జొమాటోలో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు ఏంటంటే..

ప్రతి ఏడాది చివరికల్లా స్విగ్గీ, జొమాటో కంపెనీలు వాళ్ల యాప్స్ లో ట్రెండ్ అయినవి, ఎక్కువగా ఆర్డర్ చేసిన వాటిని రిక్యాప్ చేస్తుంటారు. అలానే జొమాటో కూడా 2022లో తన కస్టమర్లు ఎక్కువగా ఏ ఫుడ్ ఆర్డర్ చేశారో, ఏ పదం సెర్చ్ చేశారో తెలిపింది. ఈ క్రమంలో జొమాటో నుంచి ఎక్కువగా బిర్యానీనే ఆర్డర్ పెట్టారట. నిమిషానికి 186 బిర్యానీలను డెలివరీ చేశారు. తర్వాత స్థానంలో పిజ్జా (నిమిషానికి 139 ఆర్డర్లు) ఉన్నాయి. 

అంతేకాకుండా.. విరాట్ కోహ్లి ఏం తింటారని (యే కోహ్లి క్యా కాతా హై) అని సెర్చ్ చేశారు నెటిజన్లు. వీటితో పాటు ఓరియో బిస్కెట్ పకోడీ అని 4,988 మంది, ఎలన్ మస్క్ ఫుడ్ గురించి 724 మంది సెర్చ్ చేశారు. ఢిల్లీకి చెందిన అంకూర్ ఈ ఏడాది జొమాటోలో 3,330 ఆర్డర్లు పెట్టాడు.