పెరిగిన జొమాటో డెలివరీ చార్జీలు

పెరిగిన జొమాటో డెలివరీ చార్జీలు

న్యూఢిల్లీ: నూతన సంవత్సర పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ జొమాటో తన ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ చార్జీని రూ. 3 నుంచి రూ. 4కి పెంచింది. కొత్త రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్‌‌‌‌‌‌‌‌లలో ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు రూ. తొమ్మిది వరకు పెంచింది.   మార్జిన్‌‌‌‌‌‌‌‌లను మెరుగుపరచడానికి,  లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ. 2 ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ చార్జీను ప్రవేశపెట్టింది. తదనంతరం దీనిని రూ.మూడుకు పెంచింది, జనవరి 1న దాన్ని మళ్లీ రూ.నాలుగుకు పెంచింది.

కొత్త ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ చార్జీ జొమాటో గోల్డ్‌‌‌‌‌‌‌‌తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో  క్విక్​కామర్స్​ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్‌‌‌‌‌‌‌‌లు  బుకింగ్‌‌‌‌‌‌‌‌లను చూసింది.   ఇదిలావుండగా, జొమాటోకు ఢిల్లీ,  కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ. 4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి.  పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ నోటీసులు వచ్చాయి.