జొమాటో కొత్త ఆఫర్.. లేట్‌‌గా ఇస్తే పుడ్ ఫ్రీ!

జొమాటో కొత్త ఆఫర్.. లేట్‌‌గా ఇస్తే పుడ్ ఫ్రీ!

న్యూఢిల్లీఆన్‌‌లైన్ పుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సరికొత్త ఆఫర్‌‌‌‌ను ప్రకటించింది. ‘ఆన్​టైం లేదా ఫ్రీ’  అనే కొత్త ఫీచర్‌‌‌‌ను​ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ప్రకారం ఆర్డర్​ ఆన్ టైంలో రాకపోతే, కస్టమర్లు మనీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఆఫర్‌‌‌‌ను డోమినోస్ ఎప్పటి నుంచో ఇస్తోంది. డోమినోస్​ ‘30 నిమిషాలు లేదా ఫ్రీ’ అనే ఆఫర్‌‌‌‌ను కస్టమర్లకు అందిస్తోంది. కానీ జొమాటో స్పష్టమైన టైం ను ప్రకటించలేదు. కంపెనీ మొదట “ ఫ్రీ పుడ్​ పొందడానికి మీరు చేసిన క్రేజియస్ట్ పనేంటి?” అని  ట్విట్టర్‌‌‌‌లో ట్వీట్​చేసి, ఆ తర్వాత ఈ ఆఫర్‌‌‌‌ను రివీల్ చేసింది.  ఈ ఫీచర్‌‌ ప్రకారం పుడ్​డెలివరీ ఆన్​టైంలో ఉంటుందని లేకపోతే మనీ ఇవ్వాల్సిన పనిలేదని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్​ఇండియాలోని 100కు పైగా​ సిటీలలోని వేల రెస్టారెంట్ల జొమాటో మెనూకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫీచర్‌‌‌‌ను వాడాలనుకుంటే, ఆర్డర్ పెట్టేటప్పుడు  ‘ఆన్ టైం లేదా ఫ్రీ’ పై క్లిక్​చేయాలి.  జొమాటో ఆన్‌‌టైంలో డెలివరీ చేయలేకపోతే, మనీ తిరిగి వాపసు ఉంటుందని తెలిపింది. ఆర్డర్​ ఆన్​టైం లేక  ఫ్రీ ఆర్డరా అనే విషయం డెలివరీ పార్టనర్లకు, రెస్టారెంట్లకు తెలియదని కంపెనీ పేర్కొంది. అందువలన డెలివరీ పార్టనర్లు టైం బ్రేక్ చేసే అవకాశం లేదని అభిప్రాయపడింది.  కంపెనీ ఈ ఫీచర్‌‌‌‌ను ప్రకటించక ముందే “కభీతో లేట్​హో జాతే’ అంటు టీవీ ప్రచారాన్ని ప్రారంభించింది.   ఈ యాడ్‌‌ బ్యాక్‌‌గ్రౌండ్లో ‘తోడా సా లేట్​ హోజాతా’ అంటు సాంగ్ వినిపిస్తుంది. కానీ డెలివరీ బాయ్​ప్రతి సారి పుడ్‌‌ను ఆన్‌‌టైంలోనే  డెలివరి చేస్తారు.  సౌత్ ఇండియాకు సంబంధించి ఈ యాడ్‌‌లో విజయ్​దేవరకొండ  జొమాటో యూజర్‌‌‌‌గా నటించారు.  ఇండియా పుడ్ డెలివరీ మార్కెట్‌‌లో మేజర్​ వాటా పొందేందుకు జొమాటో, స్విగ్గీ పోటీపడుతున్నాయి. తాజాగా ఉబర్‌‌‌‌కు చెందిన ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌ను  జొమాటో  కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ డీల్ విలువ 400 మిలియన్​ డాలర్లని, డీల్​ప్రకారం ఉబర్​ఈట్స్, జొమాటోలో 150–200 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుందని కూడా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.