ఎల్‌‌‌‌ఐసీలో డెవలప్‌‌‌‌మెంట్ ఆఫీసర్స్​ పోస్టులకి జోన్ల వారీగా నోటిఫికేషన్

ఎల్‌‌‌‌ఐసీలో డెవలప్‌‌‌‌మెంట్ ఆఫీసర్స్​ పోస్టులకి జోన్ల వారీగా నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్‌‌‌‌ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌‌‌‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భ‌‌‌‌ర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌‌‌‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్‌‌‌‌ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ ఆఫీస్​లో1408 ఏడీఓ ఖాళీలున్నాయి.

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌‌‌‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ/ మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌‌‌‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రిలిమ్స్‌‌‌‌లో రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీ, న్యూమెరికల్‌‌‌‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. మెయిన్స్‌‌‌‌లో రీజనింగ్‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌ న్యూమెరికల్‌‌‌‌ ఎబిలిటీ, జీకే, కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ తదితర సబ్జెక్టుల్లో 160 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్ ద్వారా ఫిబ్రవరి 10 వరకు  దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ మార్చి 12, మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 8న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.licindia.in సంప్రదించాలి.