
బెంగళూరు: కంపెనీ టెక్నాలజీ సెంటర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయనున్నామని వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యూనికేషన్ మంగళవారం ప్రకటించింది. ఇండియాలో తమ బిజినెస్‌ను మరింతగా విస్తరించేందుకు వచ్చే కొన్నేళ్లలో అనేక మందిని హైర్ చేసుకుంటామని పేర్కొంది. దేశంలో జూమ్ యూజర్లు పెరుగుతుండడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నాటికి ఇండియాలో జూమ్ ఫ్రీ సైనప్స్ ఏకంగా 6,700 శాతం పెరిగాయని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇప్పటికే ముంబైలో కంపెనీకి ఓ ఆఫీస్, రెండు డేటా సెంటర్లు కూ డా ఉన్నాయని జూమ్ పేర్కొంది.