కేటీఆర్‌‌‌‌కు షాక్‌‌ .. బీఆర్‌‌‌‌ఎస్‌‌కు జడ్పీటీసీ, ఆరుగురు సర్పంచ్‌‌లు గుడ్‌‌బై

కేటీఆర్‌‌‌‌కు షాక్‌‌ .. బీఆర్‌‌‌‌ఎస్‌‌కు జడ్పీటీసీ, ఆరుగురు సర్పంచ్‌‌లు గుడ్‌‌బై
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌కు జడ్పీటీసీ, ఆరుగురు సర్పంచ్‌‌లు గుడ్‌‌బై
  • సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నాయకుల రాజీనామాలు
  • కేటీఆర్‌‌‌‌ అహంకారం వల్లే పార్టీని వీడుతున్నామని వెల్లడి
  • నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరిక

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్యెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలం జడ్పీటీసీ సభ్యు డు, ఆరుగురు సర్పంచులు సహా పెద్ద సంఖ్యలో సెకం డ్ క్యాడర్ లీడర్లు సోమవారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు రిజైన్ చేశా రు. ఆదివారం సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి సర్వసభ్య సమావేశంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మా ట్లాడుతూ, ఓటమితో కుంగిపోవద్దని, ఎవ్వరూ పార్టీ వీడొద్దని సూచించారు. క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. 

అయితే, ఆ మరుసటి రోజే పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను వీడారు. ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, తెర్లుమద్ది సర్పంచ్ కిషన్ రావు(మండల సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం అధ్యక్షుడు), ఆవునూర్ సర్పంచ్ కల్యాణి భాను, మొర్రాపూర్ సర్పంచ్ భూక్య దేవేందర్, గన్నెవారిపల్లి గ్రామ సర్పంచ్ రేసు లక్ష్మీమల్లేశం, సేవాలాల్ తండా సర్పంచ్ లకావత్ శ్రీనివాస్, వెంకట్రావుపల్లి సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్, మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు అనిల్, రాజు, వేణు, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, ఎంఎసీ మాజీ చైర్మన్ అంజన్ రావు, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు రాజలింగం, సుధాకర్ రావు, నారాయణరావు పార్టీకి రిజైన్ చేశారు. వీరి రాజీనామాతో ముస్తాబాద్ మండలంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఖాళీ అవ్వనుంది. వీరంతా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగెస్‌‌‌‌‌‌‌‌లో చేరనున్నట్లు సమాచారం.

అణచివేత వల్లే పార్టీని వీడుతున్నా..

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో అణచివేత, అహంకారం వల్లే పార్టీ వీడుతున్నా. ఐదేండ్ల నుంచి జడ్పీటీసీగా కొనసాగిన. కానీ పేదలకు న్యాయం చేయలేదు. పార్టీలో ఇతర నాయకుల పెత్తనం, కేటీఆర్ ఎన్నడూ పట్టించుకోకపోవడం కలిచివేసింది. పనిచేసే వారికి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు సహకరించరు. కొంత మంది వ్యక్తుల పెత్తనం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో నడుస్తోంది. సమానత్వం లేని పార్టీలో కొనసాగలేకే రిజైన్ చేస్తున్నా. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరాలని నిర్ణయించుకున్నా. 
- జడ్పీటీసీ గుండం నర్సయ్య

కేటీఆర్ వల్లే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు రిజైన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న.. 

మాజీ మంత్రి కేటీఆర్ మమ్మల్ని కలవడానికి ఎన్నడూ సమయం ఇవ్వలేదు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల బాధలను ఆయన పట్టించుకోలేదు. అధికారం కోల్పోయాక సర్పంచ్ తరఫున గళం విప్పుతానంటుండు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు సర్పంచ్‌‌‌‌‌‌‌‌లను పట్టించుకోలేదు. ఐదేండ్లలో ఒక్కసారి కూడా కలవనీయ్యలేదు. మాకు ఒక్క రూపాయి కూడా ఫండ్ ఇవ్వలేదు. కేటీఆర్ అహంకారం వల్లే పార్టీని వీడుతున్నా. 

- కలకొండ కిషన్ రావు, ముస్తాబాద్‌‌‌‌‌‌‌‌  మండల సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం అధ్యక్షుడు