సంపదలో మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సంపదలో మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: మెటా ఫౌండర్ మార్క్ జూకర్‌‌బర్గ్‌ సంపద విషయంలో టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధిగమించారు.  మెటా షేర్లు పెరుగుతుండడంతో  ఆయన సంపద తాజాగా 186.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సంపద 180.6 బిలియన్ డాలర్లు) ను దాటి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  చేరుకున్నారు. 2020 నవంబర్ 16 తర్వాత మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపద మార్క్ జూకర్‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువ ఉండడం ఇదే మొదటిసారి. అప్పుడు  జూకర్‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపద 105.6 బిలియన్ డాలర్లు ఉంటే, మస్క్ సంపద 102 బిలియన్ డాలర్లుగా ఉంది.  

2021 లో అయితే  వీరిద్దరి సంపద మధ్య 215 బిలియన్ డాలర్ల గ్యాప్ ఏర్పడింది. అప్పుడు టెస్లా షేర్లు రికార్డ్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకోవడంతో ఎలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మస్క్ సంపద భారీగా పెరిగింది. ఈ ఏడాది టెస్లా షేర్లు 34 శాతం మేర పడ్డాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈవీ డిమాండ్ పడిపోవడం, చైనాలో  కాంపిటిషన్ పెరగడం,  జర్మనీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ సమస్యలు తలెత్తడం వంటి కారణాలు టెస్లాను వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 48.4 బిలియన్ డాలర్లు తగ్గింది.  మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఫోకస్ పెట్టడంతో  మెటా షేర్లు ఈ ఏడాది 49 శాతం ర్యాలీ చేశాయి.  జూకర్‌‌బర్గ్‌ సంపద 58.9 బిలియన్ డాలర్లు పెరిగింది.

ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్గ్ జూకర్‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపదలోనే కాకుండా బయట కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా జూకర్‌‌బర్గ్‌ థ్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలానే ఇరువురు కేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధమంటూ సవాళ్లు విసురుకున్నారు. బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టులో  ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్నార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 223 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, అమెజాన్ బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెఫ్ బెజోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 207.3 బిలియన్ డాలర్లతో సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబానీ 112 బిలియన్ డాలర్ల సంపదతో 11 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.