జైడస్తో పింకథాన్ జోడీ

జైడస్తో పింకథాన్ జోడీ

ముంబై: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్‌‌‌‌పై అవగాహన కల్పించేందుకు ఫార్మా కంపెనీ జైడస్​ పింకథాన్​తో చేతులు కలిపింది.  డిసెంబరు 21న రన్​ నిర్వహించనుంది.  ముంబైతో పాటు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌‌‌‌కతా, చెన్నై నగరాల్లో ఈ రన్‌‌‌‌ జరుగుతుంది. మొత్తం 30 వేల మందికి పైగా మహిళలు పాల్గొనే అవకాశముంది. 

ముంబై ఎడిషన్‌‌‌‌లో 3కి.మీ., 5కి.మీ., 10కి.మీ.తో పాటు 50కి.మీ., 75కి.మీ., 100కి.మీ. అల్ట్రా రన్స్, రిలే రన్‌‌‌‌లను కూడా నిర్వహిస్తామని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శర్విల్ పటేల్ చెప్పారు. ప్రతి నెలా మూడు నిమిషాల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ మహిళల ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షలకుపైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారని పేర్కొన్నారు.