ఉగ్రవాదులను పాక్ పెంచిపోషిస్తోంది 

 ఉగ్రవాదులను పాక్ పెంచిపోషిస్తోంది 

పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ దృఢమైన, నిర్ణయాత్మకమైన చర్యను కొనసాగిస్తుందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్ కు భారత్‌ తీవ్రంగా  హెచ్చరికలు చేసింది. పాక్  నుంచి భారత్‌లోకి చొరబడే ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఉగ్రవాదం, శత్రుత్వం,హింస లేని వాతావరణంలో మాత్రమే అర్ధవంతమైన చర్చలు చేయగలమని, అటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సి బాధ్యత పాక్‌పైనే ఉందని యూఎన్‌లోని భారత కౌన్సలర్‌ డాక్టర్‌ కాజల్‌ భట్‌ అన్నారు. పాకిస్తాన్ తో సహా అన్ని దేశాలతో భారత్‌ పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను ఆశిస్తోందని, ఏవైనా సమస్యలు ఉంటే, అవి ద్వైపాక్షికమైనా, సిమ్లా అగ్రిమెంట్‌, లాహోెర్‌ డిక్లరేషన్‌ లాంటి వాటిపైన కూడా శాంతియుతంగా చర్చించనున్నట్లు కాజల్‌ భట్‌ తెలిపారు. 15 దేశాలు పాల్గన్న భద్రతా మండలి సమావేశాల్లో కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడాన్ని పాక్‌ తప్పుపట్టింది.

అంతే కాదు ఉగ్రవాదులను పెంచి, పోషించే గత చరిత్ర పాకిస్తాన్ కు ఉందన్నారు  కాజల్ భట్ . యూఎన్‌ భద్రతా మండలి నిషేధించిన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పాక్‌లో ఉన్నట్లు  ఆరోపించారు. అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాక్‌ వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని భారత్‌ పిలుపునిచ్చింది.