ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.20 కోట్లు : కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.20 కోట్లు : కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్​ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల నిధుల మంజూరుకు నిజామాబాద్​జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్​లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్​రావును   వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు వేర్వేరుగా కలిశారు. 

నియోజకవర్గ సమస్యలను వివరించి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. నిధుల మంజూరుకు వారు హామీ ఇచ్చారని వినయ్​రెడ్డి తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో డీసీసీ వైస్​ప్రెసిడెంట్​వెల్మల్​గోపి, సొసైటీ చైర్మన్ ముల్లంగి అశోక్, కాంగ్రెస్ నేత దయాకర్ రావు  తదితరులున్నారు.