Good Health : మాస్క్ లాంటి దిండు.. జర్నీలో హాయిగా నిద్రపోచ్చు 

Good Health : మాస్క్ లాంటి దిండు.. జర్నీలో హాయిగా నిద్రపోచ్చు 

ప్రయాణ సమయంలో చాలా మందికి నిద్ర రావడం సహజం. ట్రైన్ లోనో, బస్ లోనో ప్రయాణిస్తున్నప్పుడు కాసేపయినా అలా కునుకు తీస్తారు. కానీ ఆ సమయంలో కుదుపుల కారణంగా సరిగా నిద్ర పట్టదు. స్లీపర్ క్లాస్ అయితే ఓకే కానీ సీటింగ్ అయితే మాత్రం నిద్ర పోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. విమానం, కారు అయితే మరీ కష్టంగా ఉంటుంది.

ఎలాంటి కుదుపులు లేకుండా హాయిగా నిద్రపోయే వారి కోసం మార్కెట్ లోకి ఓ మాస్క్ లాంటి దిండు అందుబాటులోకి వచ్చింది. ఇది మాస్క్ తరహాలో ఉంటుంది. దాన్ని ధరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిద్రపోవచ్చు. ఇది హెల్మెట్ల మన తల చుట్టూ ఉంటుంది. పైగా చాలా మెత్తగా, మృదువుగా కూడా ఉంటుంది. ఎలాంటి కుదుపులు ఉన్నా ఎటువంటి ఇబ్బంది కలగదు. 

గమ్యం చేరే వరకు హాయిగా నిద్ర పోవచ్చు. ఆన్ లైన్ లో వీటి ధర సుమారు రూ.500 దాకా ఉంది. మెడ, ముఖ భాగానికి ఇది రక్షణగా నిలుస్తుంది. ఈ దిండు ఉంటే ప్రయాణాల్లోనే కాదు. ఎక్కడైనా కూర్చున్న చోటే సుఖంగా నిద్రపోవచ్చు. కార్లు, బస్సులు, విమానం ఎక్కడైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ దిండ్లు మార్కెట్లో వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వీటిని కొనుగోలు చేసి మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసుకోండి.