భీమదేవరపల్లి, వెలుగు : కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తకొండ వీరభద్రస్వామి స్వామి బ్రహ్మోత్సవాలకు ఆనవాయితీగా వస్తున్నట్టు తెలిపారు. జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ర్ట నాయకులు రాంగోపాల్ రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీరామోజు శ్రీను, జిల్లా నాయకులు పైడిపెల్లి పృథ్వీరాజ్, దొంగల కొమురయ్య, ఎల్కతుర్తి మండలాధ్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు.
