
- నిర్మల్ జిల్లాలో దస్తురాబాద్ మండలం పెరికపల్లిలో గ్రామస్తుల ఆందోళన
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ లొల్లి పెట్టింది. సర్పంచ్ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆదివారం ధర్నా, రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని పెరికపల్లి సర్పంచ్ స్థానాన్ని రిజర్వేషన్లో భాగంగా ఎస్సీలకు కేటాయించగా, గ్రామానికి చెందిన బీసీలు దీనిని వ్యతిరేకించారు.
గ్రామంలో 99 శాతం మంది బీసీలు ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎస్సీలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. గతంలోనూ సర్పంచ్ తో పాటు 2 వార్డులను ఎస్సీలకు కేటాయించారని వాపోయారు. అధికారులు వెంటనే రిజర్వేషన్ను సవరించాలని డిమాండ్ చేశారు.